![]() |
![]() |

జబర్దస్త్ లో కామెడీ రోల్స్ చేస్తూ ఆడియన్స్ కి దగ్గరైన అమ్మాయి వర్ష. తర్వాత ఇమ్మానుయేల్ తో కలిసి ఆఫ్ స్క్రీన్ జోడిగా కూడా చేసింది. జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య కిస్సిక్ టాక్స్ అనే టాక్ షోకి హోస్ట్ గా చేస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో తొలి ప్రేమ, ప్రేమ ఎంత మధురం, మట్టి గాజులు, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్ లో నటించింది. అలాంటి వర్ష రీసెంట్ గా ఫామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కి వచ్చింది. సుధీర్ ఎపిసోడ్ కి వాళ్లందరినీ ఇండస్ట్రీ కష్టాలు అడిగేసరికి వర్ష కూడా చెప్పుకొచ్చింది.
"ఒక ఆరేడేళ్ల క్రితం నేను ఒక షో చేసాను. ఆ షోకి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు నాకు ఎం జరిగిందో ఎం గొడవ వచ్చిందో నాకు తెలీదు. వేరే ఊరిలో ఆ షోకి సంబందించిన ఒక ఈవెంట్ జరిగింది. సర్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి ఎలా చేయాలి ఎం చేయాలి అని అడిగాను. లేదమ్మా ఒక అరగంటలో మీ కొరియోగ్రాఫర్ వస్తారు. ఇక్కడ నేర్పిస్తారు మీరు డాన్స్ చేయొచ్చు అని చెప్పారు. సరే అని అక్కడే కూర్చున్నా. ఈవెంట్ అంతా ఐపోయింది. ప్యాకప్ కూడా ఐపోయింది. అందరూ సర్దేసుకుంటున్నారు. నేను మాత్రం అక్కడే కూర్చున్నా. నన్ను ఎవరూ పిలవట్లేదు. అలాంటి అవమానం తట్టుకోలేం కదా. కానీ ఆయన ఎందుకు అలా చేశారో అనే విషయం నాకు ఇప్పటికీ తెలీదు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఏ దేవుడు దీవించాడో. లేదంటే ఆ అవమానమే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళిందో తెలీదు. ఆ అవమానం వల్లనే నేను ఇంకా ఇంకా పని చేయాలి. నాకంటూ వేల్యూ వస్తుందేమో అందరూ మంచిగా పలకరిస్తారేమో అని ఘటన తర్వాతే నేను ఇంకా ఇంకా పని చేయాలని అనుకున్నాను " అంటూ తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని చెప్పుకొచ్చింది.
ఐతే ఇప్పుడు వర్ష షోస్ తో, ఈవెంట్స్ తో, షాప్ ఓపెనింగ్స్ తో, హోస్టింగ్ తో ఫుల్ బిజీగా మారిపోయింది.
![]() |
![]() |